బంగాళఖాతంలో అసని తుఫాన్ ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ తీరంలో సముద్రతీరంగా అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట గంటకు 75 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా అసన్ బలహీనపడింది. దీంతో గురువారం ఉదయానికి వాయుగుండంగా తుఫాన్ మారనుంది. చీరాల, బాపట్ల మధ్య తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉప్పాడ, కోనసీమలో సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంది.
భారీ వర్షాల వల్ల పంటలన్ని నేలకొరిగాయి. మామిడి పండ్లు నేలరాలాయి. తుఫాన్ ప్రభావంతో విశాఖ, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలు, యానం, కృష్ణ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వర్షాల వల్ల సీఎం జగన్ అప్రమత్తమై సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. యుద్ద నౌకలు, హెలికాప్టర్లను నేవీ అందుబాటులో ఉంచింది. 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర సిబ్బంది రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావంతో 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విశాఖ నుంచి విమానాలు కూడా రద్దయ్యాయి.
పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖ-0891-2590100, 2590102 , శ్రీకాకుళం-08942-240557, విజయనగరం కలెక్టరేట్- 08922-236947, 08922-276888, భోగాపురం-8074400947, చీపురుపల్లి-9440717534, కాకినాడ కంట్రోల్ రూం నంబర్-18004253077, ఏలూరు-18002331077 నంబర్లను అందుబాటులో ఉంచారు. పలు ప్రాంతాల్లో ఆర్డీవో కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే డయల్ 100కి కాల్ చేయవచ్చు.
అసని తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.