ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేస్ బుక్ అకౌంట్ ను ఇలా రద్దు చేసుకోవచ్చు

national |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 02:30 AM

ఫేస్ బుక్ అకౌంట్ ఉన్న వారు వారికి ఉన్న సౌకర్యాలపై ఇంకా పూర్తి అవగాహన లేదు అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ (Facebook). కోట్లాది మంది దీన్ని నిత్యం వాడుతున్నారు. అయితే కొందరికి ఒకటికి మించిన అకౌంట్లు ఉంటాయి. చాలా కాలం క్రితం ఓ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటారు. మళ్లీ వేరే అకౌంట్‌ను సృష్టించి వాడుతుంటారు. అలాంటప్పుడు పాత అకౌంట్ నిరుపయోగంగా ఉంటుంది. అలా వినియోగించకుండా ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను డియాక్టివేట్, డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది. మొబైల్‌ యాప్‌తో పాటు డెస్క్‌టాప్‌లోనూ ఫేస్‌బుక్ ఖాతాను డిలీట్ చేయవచ్చు. అయితే ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ చేస్తే దానికి సంబంధించిన ఫొటోలతో పాటు సమాచారం అంతా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ డిలీట్ చేశాక మనసు మార్చుకుంటే 30 రోజుల్లోగా మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ గడువు దాటితే పూర్తిగా డిలీట్ అవుతుంది. అయితే, ఫేస్‌బుక్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలో ఆ ప్రాసెస్ చూడండి.


మొబైల్‌లో ఫేస్‌బుక్‌ అకౌంట్ డిలీట్ చేయడం ఇలా..


ముందుగా ఫేస్‌బుక్‌ యాప్‌ ఓపెన్ చేయండి


పై కుడిభాగంలో నోటిఫికేషన్ బటన్ పక్కన మూడు అడ్డగీతలు ఉండే సింబల్ కనిపిస్తుంది.


దానిపై క్లిక్ చేశాక.. కిందికి స్క్రోల్ చేసి సెట్టింగ్స్ & ప్రైవసీ‌ (Setting & Privacy) ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.


ఆ తర్వాత సెట్టింగ్స్ (Settings) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


అందులో పర్సనల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ (Personal and Account Information) ఆప్షన్ ఉంటుంది.


దానిపై క్లిక్ చేస్తే అకౌంట్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ (Account Ownership and Control) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.


ఆ తర్వాత ప్రొఫైల్ యాక్సెస్ అండ్ కంట్రోల్‌ (Profile Access and Control)పై ట్యాప్ చేయండి.


అందులో డీయాక్టివేషన్ అండ్ డిలీషన్ (Deactivation and deletion) ఆప్షన్‌లోకి వెళ్లాలి.


అక్కడ డిలీట్ అకౌంట్ (Delete account) అప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని.. కంటిన్యూ టూ అకౌంట్ డిలీషన్‌ (Continue to account deletion) పై బటన్‌పై క్లిక్ చేయాలి.


ఆ తర్వాత అకౌంట్ ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారో కారణాన్ని ఎంచుకోవాలి.


అనంతరం స్క్రోల్ డౌన్ చేసి డిలీట్ అకౌంట్‌ (Delete Account) పై క్లిక్ చేయాలి. అంతే ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది.


డెస్క్‌టాప్ నుంచి ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయడం ఇలా..


డిస్క్‌టాప్ వెబ్‌బ్రౌజర్ నుంచి కూడా ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసుకోవచ్చు. అందుకు ఈ ప్రాసెస్ ఫాలో అవండి.


ముందుగా బ్రౌజర్‌లో ఫేస్‌‌బుక్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.


పైకుడి భాగంలోని డౌన్ యారో ఐకాన్‌ (Down arrow) పై క్లిక్ చేస్తే కింద ఆప్షన్లు వస్తాయి.


సెట్టింగ్స్ & ప్రైవసీ (Settings & Privacy) పై క్లిక్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి (Settings) వెళ్లండి.


ఎడమవైపున వచ్చే మెనూ ప్యానెల్‌లో యువర్ ఫేస్‌బుక్‌ అకౌంట్ ఇన్ఫర్మేషన్ (Your Facebook Account Information) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే.. డీయాక్టివేషన్ అండ్ డిలీషన్ (Deactivation And Deletion) అనే ఆప్షన్ కనిపిస్తుంది. వ్యూ (View) అని దాని పక్కన ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.


డిలీట్ అకౌంట్‌ (Delete Account) ను సెలెక్ట్ చేసుకొని.. కంటిన్యూ టూ అకౌంట్ డిలీషన్‌ (Contineu Account deletion) బటన్‌పై క్లిక్ చేయాలి.


ఆ తర్వాత వెరిఫికేషన్‌ కోసం పాస్‌వర్డ్‌ను టైప్ చేసి.. కంటిన్యూ (Continue) పై క్లిక్ చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa