ఇరువురు టీడీపీ నేతలు వియ్యంకులు అవుతున్న వేళ వారిద్దరి పిల్లల నిశ్చితార్థానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టీడీపీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ్, ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతిల వివాహ వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో మొదలయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం సంగీత్ జరగగా... ఈ వేడుకకు హాజరైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సిద్ధార్థ్, జస్వంతిల వివాహం రేపు (మే 12) హైదరాబాద్‌లో వేడుకగా జరగనుంది. బుధవారం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు గురు, శుక్రవారాలు అక్కడే వుంటారు. ఈ నేపథ్యంలో వీరి వివాహ వేడుకకు చంద్రబాబు హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సంగీత్ వేడుకకే వచ్చిన చంద్రబాబు నూతన జంటను ఆశీర్వదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa