ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారంలోగా దేశానికి కొత్త ప్రధాని: గొటబయ రాజపక్స

international |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 12:00 PM

ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో పెరుగుతున్న ఆందోళనలతో ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స కీలక ప్రకటన చేశారు. వారం వ్యవధిలోగా దేశానికి కొత్త ప్రధాని బాధ్యతలు చేపడతారని ప్రకటించారు. దేశం మరింత సంక్షోభంలోకి జారిపోకుండా ఉండేందుకు రాజకీయ పార్టీలతో ఆయన బుధవారం చర్చలు ప్రారంభించారు. ఈ సమావేశంలో రాజపక్స కుటుంబం నుంచి ఎవరూ లేకుండా కొత్త యువ మంత్రివర్గాన్ని నియమిస్తానని అధ్యక్షుడు గొటబయ హామీనిచ్చారు. కొత్త ప్రభుత్వ ప్రధానమంత్రికి కొత్త విధానాలను రూపొందించి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు.


దేశాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మాట్లాడారు. ప్రజలు, రాజకీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వానికి పిలుపునిచ్చాయని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నానని, ఈ నిర్ణయంతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. ఇక హింసాత్మక నిరసనల నేపథ్యంలో శ్రీలంకలో విధించిన కర్ఫ్యూను మే 12 ఉదయం 7 గంటలకు ఎత్తివేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి మే 13 శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ మళ్లీ అమలు చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa