కరోనా వైరస్ వెలుగుచూసిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలో కరోనా కేసులు నమోదైన వెంటనే ఉత్తర కొరియాలో సరిహద్దులు మూసివేసి కట్టడి చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు అక్కడ ఒక్క కరోనా కేసు కూడా రాలేదని ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ గర్వంగా చెప్పుకున్నారు. తాజాగా తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలను పెంచాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లు విధించాలని స్పష్టం చేశారు. ప్యాంగ్యాంగ్ లో పలువురికి కరోనా టెస్టులు చేయగా వారిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం తెలిపింది.