మ్యుటేషన్ నిమిత్తం రూ. 7వేలు లంచం డిమాండ్ చేసిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి సౌత్ విభాగ వీఆర్వోగా సూరిశెట్టి భవానీ వరప్రసాద్ పని చేస్తున్నారు. మ్యూటేషన్ కోసం స్థానిక బంగారం వ్యాపారి సూరిశెట్టి రామలింగ జగ్గా అప్పారావు కొన్నాళ్లుగా వారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే తనకు రూ.7వేలు లంచం ఇస్తే పని పూర్తవుతుందని వరప్రసాద్ చెబుతూ వచ్చారు. దీంతో బాధితుడు అప్పారావు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా వరప్రసాద్ ను ఏసీబీ అధికారులు హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో వరప్రసాద్ పై కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశ పెడతామని అధికారులు తెలిపారు. ఏసీబీ దాడుల్లో డీఎస్పీ రామచంద్ర రావు, సీఐలు రమేష్, కిషోర్, ప్రేమ కుమార్, సతీష్, శ్రీనివాస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.