మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో గురువారం హైవేపై వేగంగా వస్తున్న ట్రక్కు కారు, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.బేతుల్-నాగ్‌పూర్ నాలుగు లేన్ల రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని సైఖేడా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు, ద్విచక్రవాహనదారుడు మృతి చెందినట్లు అధికారి తెలిపారు.మరణించిన దంపతులు అన్మల్ బార్ (40), అతని భార్య రాజ్ లక్ష్మి (35) పూణే నివాసితులు,ద్విచక్రవాహనదారుడిని భీమ్‌రావు (35)గా గుర్తించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa