వాహనదారులకు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజా పెట్రోల్, డీజిల్ ధరల డేటాను విడుదల చేయడం జరిగింది. నేడు విడుదల చేసిన సమాచారంలో హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ ధరపై 17 పైసలు పెరిగింది. దీంతో లీటరు రూ.119.66కు చేరుకుంది. గురువారం ఈ ధర రూ.119.49గా ఉంది. అదేవిధంగా డీజిల్ ధర కూడా హైదరాబాద్‌లో రూ.105.49 నుంచి రూ.105.65కు చేరింది. గత నెల రోజులకు పైగా స్థిరంగా ఉంటూ వచ్చిన ధరలు నేడు పెరిగి వాహనదారులకు షాక్ ఇచ్చాయి.