టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ప్రజా ప్రతినిధు కోర్టులో ఊరాట లబించింది. ఆయనపై నమోదైన కేసును విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు...చింతమనేనిపై అభియోగాలను పోలీసులు నిరూపించలేకపోయారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే చింతమనేనిపై కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
2011లో ఓ మహిళపై దాడి చేశారంటూ చింతమనేనిపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై ఏలూరు పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరగగా... కేసులో చింతమనేనిపై నమోదు చేసిన అభియోగాలు రుజువు కాలేదు. దీంతోనే కోర్టు ఆయనపై నమోదైన ఈ కేసును కొట్టివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa