ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేదించింది. గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లో సాహా 67 పరుగులు , వేడ్ 20 పరుగులు , శుభ్‌మన్ గిల్ 18 పరుగులు, హార్దిక్ 7 పరుగులు , మిల్లర్ 15 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో పతిరణ 2 వికెట్లు తీయగా, మొయిన్ అలీ 1 వికెట్ తీశారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్ లో రుతురాజ్ గైక్వాడ్ 53, జగదీశన్ 39, మోయిన్ అలీ 21 పరుగులు చేశారు. కాన్ వే 5, ధోని 7, దూబే 0 పరుగులకే వెనుదిరిగారు. గుజరాత్ బౌలర్లలో షమీ 2, రషీద్ ఖాన్ 1, సాయి కిషోర్ 1, అల్జారీ జోసెఫ్ 1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa