మైనర్ బాలుడి పెదాలను ఎవరైనా ఓ పురుషుడు ముద్దు పెట్టుకోవడం అసహజ శృంగార చర్యగా భావించలేమని బోంబే హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. ఈ కేసులో బాధిత బాలుడు గతేడాది తమ ఇంటి సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లాడు. అక్కడ దుకాణ యజమాని ఈ బాలుడిని లైంగికంగా వేధించాడు. బాలుడి అవయవాలను అభ్యంతరకర రీతిలో తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఇంట్లో డబ్బులు లేని విషయాన్ని బాలుడి తండ్రి గమనించాడు. దీనిపై తమ 14 ఏళ్ల కుమారుడిని ఆరా తీయగా లైంగిక వేధింపుల విషయం బయటకు వచ్చింది. దీంతో బాలుడి తండ్రి గతేడాది పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని పోక్సో చట్టం, ఐపీసీ 377 సెక్షన్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. దీనిపై బోంబే హైకోర్టులో జస్టిస్ అనూజ ప్రభుదేశాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు వైద్య పరీక్షల్లో ఆధారాల్లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకోవడం ఐపీసీ 377 సెక్షన్ కింద నేరంగా భావించలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.