గుంటూరులో బ్యాడ్మింటన్ లో శిక్షణతో శ్రీకాంత్ ప్రస్థానం ప్రారంభమయ్యింది. 2001 సమయంలోనే కోచ్ షేక్ అన్వర్ భాషా శిక్షణలో శ్రీకాంత్ బ్యాడ్మింటన్ లొ ఓనమాలు దిద్దారు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాంత్ విజయం సాధించి బహుమతి అందుకున్నారు. అప్పటి నుంచే బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి ని పెంచుకున్నారు. అంచలంచెలుగా ఎదిగి ప్రపంచ స్థాయి పోటీల్లో తలపడే స్థాయికి ఎదిగారు.