ఆంధ్రరాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలిచి.. సంపూర్ణ సహాయ సహకారాలు అందించి.. రైతుపక్షపాతిగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. రైతులు సంతోషంగా లేరని మాట్లాడుతున్న చంద్రబాబు.. ఎందువలనో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ రైతులకు మేలు చేస్తుంటే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు మొసలి కన్నీరు కార్చినా.. రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్‌ను విమర్శించే స్థాయి పవన్, లోకేష్‌లకు ఉందా అని ప్రశ్నించారు. పది పంటలు చూపిస్తే.. కనీసం ఐదు పంటల పేర్లయినా పవన్, లోకేష్ చెప్పగలరా..? అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్ రైతు భరోసా కింద మూడేళ్ల పాటు రూ.13,500 చొప్పున రైతులకు అందించారని, నాల్గవ సంవత్సరం మొదటి విడత కింద 50 లక్షల మంది పైచిలుకు మే మాసంలో ఇచ్చే పెట్టుబడి సాయం రూ.7,500ల్లో రూ.5,500 నేడు విడుదల చేస్తున్నారని, మరో రూ.2 వేలు పీఎం కిసాన్ పథకం కింద ఈనెలాఖరుకు విడుదల చేయనున్నారని చెప్పారు. ఎలాంటి లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హత గల రైతులందరికీ వైయస్‌ఆర్ రైతు భరోసా –పీఎం కిసాన్ పథకం అందజేస్తున్నామన్నారు.