భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని బలోపేతం చేయడంపై మే 19 నుండి మే 21 వరకు రాజస్థాన్లోని జైపూర్లో దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆఫీస్ బేరర్ల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో మే 20న వర్చువల్ గా సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.ఈ రోజున పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా మే 19న జైపూర్ చేరుకుని ప్రధాన కార్యదర్శులందరితో సమావేశం కానున్నారు.