నేపాల్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం లక్నో చేరుకున్నారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు.లక్నో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రులతో మోదీ సమావేశం కానున్నారు. రాజకీయంగా కీలకమైన రాష్ట్రంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న తర్వాత యూపీ మంత్రులతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి.యూపీ కేబినెట్ మంత్రులు ఇటీవల రాష్ట్రంలోని 18 డివిజన్లలో తమ పర్యటనలను ముగించారు.