బుద్ధపూర్ణిమ జయంతి వేడుకలను ఆదివారం నాగిల్ గిద్ద మండలం కరస్ గుత్తిలో ఘనంగా నిర్వహించారు. కరస్ గుత్తి గ్రామంలోని దళితవాడలో గల బుద్ధ మందిరంలో దళిత నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో కొవ్వొత్తులు, దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్. గణపతి, కృష్ణ, నర్సప్ప, మారుతి, కంటప్ప, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.