ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సబ్సిడీ కింద ఇవ్వన్నా విత్తనాల కోసం అర్హులైన రైతులు స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సిరివెళ్ల మండల వ్యవసాయ అధికారి సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 50 శాతం సబ్సిడీ కింద జీలుగ విత్తనాలను ఇవ్వనున్నట్లు వివరించారు. కేజీ జీలుగ విత్తనాల ధర రూ. 63. 90 ఉండగా సబ్సిడీ పోనూ రూ. 31. 95 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. 5 ఎకరాల లోపు రైతుకు గరిష్ఠంగా 5 ప్యాకెట్లు అందజేస్తామని వెల్లడించారు.