ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. లొంగదీసుకున్నాడు. కోరిక తీరిన తర్వాత మొహం చాటేశాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.సబ్బవరం మండలం ఎరుకు నాయుడు పాలెం గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన అప్పలరాజును 2015 నుంచి ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆపై లొంగదీసుకుని.. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి మొహం చాటేశాడు. దీంతో యువతి పెద్దల వద్ద పంచాయితీ పెట్టింది.
చివరకు పెళ్లికి ఓపెన్ అప్పలరాజు సబ్బవరం శివాలయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా ఆ యువతి అక్కడికి వెళ్లేసరికి అప్పలరాజు రాలేదు. ఫోన్ చేసి అడిగితే ఇద్దరి జాతకాలు కలవలేదని పెళ్లి చేసుకుంటే తాను చనిపోతానని అబద్ధం చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి మెహాద్రి గెడ్డలో దూకడానికి ప్రయత్నించగా స్థానికులు కాపాడారు. ఈమేరకు స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా. పోలీసులు కేసు నమోదుచేసి అప్పలరాజును రిమాండ్కు పంపినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు.