వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు కొమ్మాది సమీపంలోని బక్కన్నపాలెంలో నివాసం ఉంటున్న కోసురు మాధురి(24)కి ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఈమె భర్త యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మాధురికి అత్తింటి వారి నుండి అదనపు కట్నం కోసంవేధింపులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాధురి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వేలాడుతున్న ఆమెను కిందకు దించి సమీపంలోనిఆస్పత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై శ్రీనివాస్ నేతృత్వంలో పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.