ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచక, కీచక పరిపాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని టిడిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి టి. స్వప్న, మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్ర గౌడ్ మండిపడ్డారు.సోమవారం రాత్రి టిడిపి పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉన్మాది పాలనలో ఆడబిడ్డలకు ఊరూర ఉరితాడే, అసువు లు బాసిన ఆడబిడ్డలకు అశ్రునివాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా స్థానిక టిడిపి కార్యాలయం నుంచి మహాత్మా గాంధీ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యా చారాలు, హత్యలు, దాడులు పెరిగిపోయా యని ధ్వజమెత్తారు. కావున రానున్న ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పి ఇంటికి పంపాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి మహిళా ప్రధాన కార్యదర్శి వాల్మీకి ప్రియాంక, మాజీ ఎంపిపి, జిల్లా ఉపాధ్యక్షురాలు వాల్మీకి సుంకురత్నమ్మ, జిల్లా ప్రచార కార్యదర్శి కుంటిదేవి, ఉరవకొండ నగర మహిళా అధ్యక్షురాలు తులసి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి మహేశ్వరి, పార్లమెంటు ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు అంజలి, కార్యదర్శి బి. లక్ష్మి కౌన్సిలర్ అరుణ, నాయకులు పాల్గొన్నారు.