ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపింది. అతడి తలమీద రాయితో బాది, మర్మాంగాన్ని కత్తితో కోసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్లో జరిగింది. మృతుడిని శాహువాడీలోని లోలనే గ్రామానికి చెందిన ప్రకాశ్ పాండురంగ కాంబ్లేగా (52) గుర్తించారు. అతడి భార్య పేరు వందన పాండురంగ్ కాంబ్లే (50). వారిద్దరూ కొద్ది నెలలుగా మంగుర్వాడీలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు. వందనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రకాశ్ ఆమెను తాగి వచ్చి కొడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి గొడవ జరగగా ప్రకాశ్ ను వందన హత్య చేసింది. అతడి తలమీద రాయితో బాది, మర్మాంగాన్ని కత్తితో కోసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వందనను అదుపులోకి తీసుకున్నారు.