ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మినుములతో కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 11:52 AM

మినుములు తింటే ఇనుము అంత బలం అని అంటుంటారు. మినుముల్లో ఉండే పోషకాలు మంచి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రకరకాల జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుందని అంటున్నారు. 100 గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు(ఫైబర్)ఉంటుంది. ఒక గ్రాము పొటాషియం, 2 గ్రాముల కొవ్వుతో పాటు విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1, బీ3 వంటివి పుష్కలంగా ఉంటాయి.

అంతేకాకుండా మినుముల్లో కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. మినుముల్లో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది. కాబట్టి గాయాలు తగ్గడానికి మినుములు మంచి ఆహారంగా సహాయపడతాయి. ఇక మినుముల్లో దాదాపు 72 శాతం ఫీచు ఉండటం వల్ల అవి మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మినుములు మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను కూడా తొలగిస్తాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మందులకు బదులు మినుములతో చేసిన వంటకాలను తినవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com