ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. శిక్ష పరిమాణంపై వాదనలు మే 25న జరుగుతాయి. తదుపరి విచారణ తేదీకి ముందు మాలిక్ తన ఆర్థిక ఆస్తుల పై అఫిడవిట్‌ను సమర్పించాలని కోర్టు కోరింది. 2017కు సంబంధించిన ఈ కేసులో మాలిక్‌పై దిల్లీ కోర్టులో ఇటీవల అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండితుల హత్యల్లోనూ వీరిపాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండితులు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్ఎఫ్కు సంబంధాలు ఉన్నాయి.