అనంతపురం జిల్లా బెలుగుప్ప తండాలో చిరుత దాడిలో 45 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గొర్రెల కాపారులు పాతన్న, సోము, చౌడప్పకు చెందిన దాదాపుగా 45 గొర్రె పిల్లలను దొడ్డిలో వదిలి గొర్రెలను మేపడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా చిరుత దాడిలో మృతి చెందిన 45 గొర్రె పిల్లలు కనిపించాయి. దాదాపుగా 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపారులు పాతన్న, సోము, చౌడప్ప అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.