మార్కాపురం పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఏబీఎం పాఠశాల వద్ద గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు గురువారం రాత్రి వీరాంగం సృష్టించాడు. పాఠశాల ఆవరణలో ఉన్న ఓ గదిలోకి తాళాలు పగులగొట్టి ప్రవేశించి అందులోని సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశాడు. అతడిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కందుల మల్లికార్జునరెడ్డి అనే యువకుడి తలకు, మెడ కింద గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించగా సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఇ సుబ్బరాజు ఘటనపై ఆరా తీశారు. అనంతరం దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.