దొనకొండ మండలంలోని దొండపాడుకు చెందిన ఒక వ్యక్తి మరొ కరికి రూ.10 వేలు ఇవ్వాల్సి ఉండగా ఆ నగదు అడగటంతో గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఘర్షణ జరిగింది. సాయంత్రం ఆ గ్రామస్తులు కొందరు దొనకొండ వచ్చి మద్యం తాగి అదే విషయంపై మళ్లీ ఘర్షణ పడ్డారు. విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్న మరికొంతమంది గ్రామస్థులు దొనకొండ వచ్చి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. పాపయ్య అనే వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. ఘర్షణ విషయం తెలిసి ఎస్ ఐ అంకమ్మ సిబ్బందితో వచ్చి అందరినీ చెదరగొట్టారు. సుమారు పది మందిని ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.