కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో మృతదేహం కనిపించడం కలకలం రేపింది. అనంత ఉదయ్ బాబు కారులో ఆయన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం కనిపించింది. గురువారం ఉదయం ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు తన డ్రైవర్ ను తీసుకెళ్లారు.
ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఎమ్మెల్సీ ఉదయ్ బాబు సమాచారమిచ్చారు. తెల్లవారుజామున 2 గంటలకు మృతుడి తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహం వదిలి వేరే కారులో వెళ్లిపోయారు. అయితే సుబ్రహ్మణ్యం ను కొట్టి చంపారని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa