చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లి గ్రామ పంచాయతీలోని నాగవేణి రవి దంపతుల కుమారుడు కిరణ్ (13) 9వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవు రావడంతో తల్లితండ్రి మాట వినకుండా జులాయిగా తిరిగేవాడు. దీంతో వారు మందలించడంతో ఇంటి నుండి అలిగి వెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనిపిస్తే సమాచారం తెలపాలని ఆవేదన వ్యక్తం చేశారు.