నకరికల్లు మండల పరిధిలోని దేచవరo గ్రామంలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రతిష్ఠ మహోత్సవం జూన్ 22 న జరుగుతుందని ఆలయ నిర్వహణ అధికారి, వైకాపా మండల కన్వీనర్ భవనం రామిరెడ్డి ప్రకటించారు. ఈ రోజున స్వామి వారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు తలనీలాలు సమర్పించే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.