ఆస్తి వివాదం కారణంగా గురజాల మండలం జంగమహేశ్వరపురం లో తండ్రీ కొడుకులు గురువారం కత్తిపోట్లకు గురయ్యారు. మల్లాలమ్మ తిరునాళ్ళలో గ్రామానికి చెందిన పాశం వెంకటేశ్వర్లు, కుమారుడు వెంకటేశ్వర్ల ను అదే గ్రామానికి చెందిన మారెబోయిన శ్రీనివాసరావు, సోమయ్య మరో ఐదుగురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో కుటుంబాల మధ్య ఆస్తి వివాదం కారణంగా దాడి చేసినట్లు తెలిపారు.