మేడి కొండూరు మండల పరిధిలోని డోకిపర్రు గ్రామంలో గురువారం హెల్త్ ఫౌండేషన్, కామాక్షి ఐ కేర్ సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ నేత్ర శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కొండెపొగు సామ్రాజ్యం ప్రారంభించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో 210 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం 18 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.