బాపట్ల జిల్లాలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించడం జరిగిందని, జాతీయ రహదారి 16 , 216 లపై అత్యధికంగా 22 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
నిబంధనలు పాటించని వాహనాలకు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారికి గత ఏడాది కాలంలో 45 వేల కేసులు నమోదు చేసి, చలానాల రూపంలో రు. 79 లక్షలు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు.
కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ
రోడ్డు ప్రమాదాలపై మాటలు వద్దు ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో అత్యంత బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. మనుషుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోని వారు, పరోక్షంగా హత్య చేసినట్లు సమానం అన్నారు. రోడ్డు భద్రత విషయంలో ప్రతీ శాఖ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. యుద్ద ప్రాతిపదికన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాద సూచికలను, రేడియం స్టిక్కర్లని 4 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ, పోలీస్ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.