వ్యాయామం చేయకపోయినా, స్థూలకాయం ఉన్నా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి కిడ్నీల్లో రాళ్లు అధికంగా వస్తాయి. నీళ్లు తక్కువగా తాగుతున్నప్పుడు, మాంసాహారం అధికంగా తిన్నపుడు, స్టిరాయిడ్ లను ఎక్కువ మోతాదులో తీసుకున్నపుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు రెండు రకాలుగా ఉంటాయి. కాల్షియం అక్సినేట్, కాల్షియం ఫాస్పేట్. రక్తంలోని మలినాలను వడగట్టడంలో, శరీరంలోని అమ్ల, క్షార స్థాయిని నియంత్రించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో విటమిన్ బి6, సి లోపం ఉన్నపుడు, విటమిన్ డి అధికంగా ఉన్నప్పుడు, మందుబాబులకు కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కిడ్నీలకు తరచుగా ఇన్‌ఫెక్షన్లు సోకినపుడు, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు వస్తాయి. ఆలస్యంగా భోజనం చేయడంతో పాటు నిద్ర సరిగా లేని వారికీ రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టండిలా..
- రోజుకు కనీసం 5 లీటర్ల నీరు తాగాలి.
- రాత్రి పూట మెంతులను నానపెట్టి ఉదయం తాగాలి.
- కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని ప్రతి రోజు తాగాలి.
- పాలకూర, టమోటాలు, పాలు ఏవైనా కలిపి తీసుకోవద్దు. విడివిడిగా తీసుకోవాలి.
- చక్కెర, ఉప్పు బాగా తగ్గించాలి. అధిక కారం, మసాలాలు బాగా తగ్గించాలి.
- ఆకు కూరలు, కూరగాయలు విడివిడిగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆకుకూరల్లో కాల్షియం, కొన్నింటిలో అక్సిలేట్, కొన్నింటిలో పొటాషియం ఉంటాయి. కలిపితే వాటి స్థాయి పెరిగి కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది.