భారత్‌తో పోలిస్తే చాలా పెద్ద, అభివృద్ధి చెందిన దేశాలలో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి. వీటిలో అమెరికా, జపాన్, చైనాలున్నాయి. జపాన్‌లో లీటరు పెట్రోల్ ధర 1.25 డాలర్లు కాగా, చైనాలో 1.21 డాలర్లు, అమెరికాలో 98 సెంట్స్‌గా పలుకుతున్నాయి. అయితే మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి. వియత్నాం, కెన్యా, ఉక్రెయిన్, వెనిజులా దేశాలలో కూడా భారత్‌తో పోలిస్తే ధరలు చౌకగా పలుకుతున్నాయి.
వినియోగదారిగా, దిగుమతిదారిగా భారత్ ఉంది. భారత్ తన ఆయిల్ అవసరాలలో 85 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది.
పెట్రోల్ అత్యధికంగా పలుకుతోన్న దేశంలో హాంకాంగ్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ లీటరు పెట్రోల్ ధర 2.58 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీల్లో ఈ ధర రూ.200 పైనే. జర్మనీలో లీటరు పెట్రోల్ ధర 2.29 డాలర్లు కాగా.. ఇటలీలో ఈ ధర 2.28 డాలర్లుగా, ఫ్రాన్స్‌లో 2.07 డాలర్లుగా, ఇజ్రాయిల్‌లో 1.96 డాలర్లుగా, బ్రిటన్‌లో 1.87 డాలర్లుగా ఉంది. ఈ దేశాల్లో మాత్రమే కాక.. ఫిన్‌ల్యాండ్, పోర్చుగల్, నార్వే వంటి దేశాలలో కూడా లీటరు పెట్రోల్ ధర 2 డాలర్ల వద్ద నమోదవుతోంది.
అయితే బ్యాంకు ఆఫ్ బరోడా రీసెర్చ్ రిపోర్టు ప్రకారం, భారత్‌లో లీటరు పెట్రోల్ ధర 1.35 డాలర్లు. రూపాయి విలువలో ఈ ధర ఢిల్లీలో రూ.105.41గా ఉంది. ఈ ధరతో భారత్ 42వ స్థానంలో నిలిచింది. హాంకాంగ్, ఫిన్‌లాండ్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, నార్వే వంటి దేశాలలో పెట్రోల్ ధర భారత్ కంటే అధికంగా ఉంది.
ఇదిలావుంటే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో.. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. క్రూడాయిల్ పెరుగుతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండుతున్నాయి. పెట్రోల్ అత్యధికంగా పలుకుతోన్న దేశాల జాబితాలో మన భారత్ 46వ స్థానంలో ఉంది. 106 దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుపుతూ బ్యాంకు ఆఫ్ బరోడా ఎకనామిక్ రీసెర్చ్ ఓ రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టులో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు