ఈ ఏడాది సిలిండర్‌కు రూ.200 చొప్పున గ్యాస్ సబ్సిడీ సైతం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలోని 9 కోట్ల మంది ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని వల్ల కేంద్రంపై ఏడాదికి రూ.6100 కోట్ల మేర భారం పడుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ప్రజలపై పెట్రోభారం తగ్గించడం కోసం లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయల మేర, డీజిల్‌పై 6 రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 9.5 రూపాయల మేర, లీటర్ డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గనుందని ఆమె తెలిపారు.