ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింలలో బాబ్రీ తరహా ఆందోళన: అసదుద్దీన్ ఓవైసీ

national |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 12:28 PM

జ్ఞాన్‌వాపి మసీదును వివాదంలోకి లాగడంతో బాబ్రీ మసీదు వంటి ఘటన పునరావృతం అవుతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారని ఒవైసీ అన్నారు. జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారంలో కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. అలాగే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమంటూ జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదించడంపై ఒవైసీ స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్లకు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు.


దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని సంఘ్ పరివార్ యోచిస్తోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్‌వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్ పరివార్ ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ్ ఈ దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని చూస్తోందని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com