డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల విచారణ కోనసాగుతోంది. ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే అతన్ని చంపినట్లు ఎమ్మెల్సీ అనంత్ బాబు ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్యలో తాను ఒక్కడే పాల్గొన్నట్లు అనంత్ బాబు పోలీసులకు తెలిపారు. సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కాకినాడ పోలీసులు తెలిపారు.