పొగ, చెత్త కాలుష్యాలతోనూ కాదు శబ్ద కాలుష్యం కూడా గర్బవతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శబ్ద కాలుష్యం తల్లి, బిడ్డ ఇద్దరిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెద్ద శబ్దాల కారణంగా ఒత్తిడి పెరగడం,నిద్ర భంగం కలిగే సమస్య ఉంది. ఒత్తిడి హార్మోన్లకు అసమతుల్యతను కలిగించడం ద్వారా ఎండోక్రైన్ వ్యవస్థ ద్వారా పిండం పెరుగుదలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి వల్ల బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గర్బవతులు శబ్ద కాలుష్యం నుంచి బయటపడేందుకు చెవి ప్లగ్‌లు, ఇయర్‌మఫ్‌లు వాడితే మంచిది.. మీ నిద్రకు ఆటంకం కలిగించకుండా నిరోధించడంలో సహాయపడతాయి. వీలైనంత వరకు పెద్ద శబ్దానికి దూరంగా ఉండటం ఉత్తమం. వైబ్రేషన్, రంబుల్.. శబ్ధాలు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటాయి. ఈ శబ్దాలు మీ శరీరంలో సులభంగా ప్రయాణిస్తాయి. మీ బిడ్డ ఎదుగుదలను ఇవి ప్రభావితం చేస్తాయి. అందువల్ల అటువంచి శబ్దాలకు దూరంగా ఉండాలి.