జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ల్యాoప్ సంస్థ డైరెక్టర్ సాల్మన్ పాల్ అన్నారు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలో జీవవైవిధ్య పరిరక్షణ సదస్సు సోమవారం నిర్వహించారు. సాల్మన్ పాల్ మాట్లాడుతూ. నేటి ప్రపంచం లో చోటుచేసుకుంటున్న అనేక విపత్తులు, వ్యాధులు ఉపద్రవాల కారణం పర్యావరణ సమతుల్యత లోపం కారణంగా ఏర్పడుతున్నాయని చెప్పారు. విద్యార్థి దశ నుండే మొక్కలు నాటాలని అన్నారు.