జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైష్ణోదేవి భక్తులతో వెళుతున్న బస్సు అగ్నిప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 22 మందికి గాయాలయ్యాయి.వైష్ణోదేవి ఆలయం బేస్ క్యాంప్ అయిన ఖాత్రాలోని శనిదేవ్ దేవాలయం దగ్గర ఈ ఘటన జరిగింది. బస్సులో మంటలు వ్యాపించి దగ్గమైంది. బస్సులో పేలుడు సంభవించడం వల్లే మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన వెనుక ఉగ్ర కోణం ఉండకపోవచ్చని తెలిపారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.బస్ నెంబర్ JK14/1831 ఖాత్రా నుంచి జమ్మూ వెళుతుండగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిస్ నిపుణులు మంటలకు కారణాలు తెలుసుకునేందుకు ఆధారాలు సేకరించారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషన్ ప్రకటించారు.