శరీరంలోని అన్ని జీవక్రియలకు నీరు ఎంతో ముఖ్యం. అయితే ఉదయాన్నే నీటిని తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మన శరీరంలో అవయవాలకు మూడు వంతుల నీరు తాగడం మంచిది.
రోజంతా కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి.
ఉదయం పూట కనీసం రెండు గ్లాసుల నీరు తాగాలి.
ఇలా నీటిని తాగితే బాడీలో జీవక్రియలు సరిగ్గా ఉంటాయి.
పిల్లల విషయానికొస్తే వారికి 3 నుంచి 4 లీటర్ల వరకు నీటిని తాగించాలి.
ఉదయాన్నే ఓ గ్లాసు నీటిని పిల్లలకు తాగించడం మంచిది.
ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుంచి లీటరున్నర వరకూ నీరు తీసుకోవడం మంచిది.
ఇలా నీటిని తాగితే మలబద్ధకం, జీర్ణసమస్యలు రావు.
నీటిని బాగా తాగితే అందం కూడా మీ సొంతం అవుతుంది.
నీరు తాగిన తర్వాత 20 నిమిషాల వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
ఉదయం పూట నీరు తాగితే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.
గోరువెచ్చని నీళ్లు తాగితే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.