ఈరోజు హైదరాబాద్ లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్‌బి) ద్విదశాబ్ధి ఉత్సవాలను జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా ఎదిగిన హైదరాబాద్ ఐఎస్‌బి ఇక్కడకు రావడం వెనుక చంద్రబాబు కృషి మరువలేనిది అని టీడీపీ నాయకులూ తెలిపారు. 1998 నాటి మాట. చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారతదేశంలో ఓ బిజినెస్ స్కూల్ పెడుతున్నాయని... దాని ఏర్పాటు బాధ్యతలను మెకంజీ చీఫ్ రజత్ గుప్తా ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం చూస్తోందని చంద్రబాబుకి తెలిసిన వెంటనే రజత్ గుప్తా బృందానికి ఫోను చేసారు. ఐఎస్‌బీ ఏర్పాటుకు బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలను మాత్రమే పరిశీలిస్తున్నామని గుప్తా చెప్పారు. సరే, ఐఎస్‌బీ సంగతి పక్కనబెట్టండి.. వీలు చూసుకొని హైదరాబాద్ వచ్చి ఓ కాఫీ తాగి వెళ్లండని ఆఫర్ చేశారు చంద్రబాబు. చంద్రబాబు ఆహ్వానం మేరకు హైదరాబాదుకు వచ్చిన ప్రతినిధి బృందానికి మిగతా రాష్ట్రాల స్పందన కంటే చంద్రబాబు ఆదరణ బాగా నచ్చి, హైద్రాబాదులో ఐఎస్‌బీ పెడితే మీరిచ్చే ప్రోత్సాహాలు ఏంటి అని వాళ్ళు అడిగారు. మిగతా మూడు రాష్ట్రాల కంటే ఎక్కువే ఇస్తానన్నారు చంద్రబాబు, అలా హైదరాబాద్‌కు వచ్చిన ఐఎస్‌బీ ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని వాజపాయి వచ్చారు. ISBకి నేటితో 20 యేళ్లు. ఈరోజు కార్యక్రమానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఆరోజు చంద్రబాబు పట్టుబట్టి తీసుకురాకపోతే ఐఎస్‌బీ మరో రాష్ట్రానికి వెళ్లిపోయేది అని ఐఎస్‌బీ గురించి తెలిపారు.