కర్నూలులోని పెద్దపాడు రాజీవ్ గృహకల్పకు చెందిన వడ్ల నాగలక్ష్మి (23) యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి. కల్లూరుకు చెందిన తన మేనమామ సీతారాంతో ఆమెకు వివాహం కాగా, ఒక కుమార్తె సంతానం వున్నారు. అయితే అనివార్య కారణాలతో కొద్ది రోజులుగా భర్తకు దూరమైంది. తర్వాత భర్త కాపురానికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన నాగలక్ష్మి మంగళవారం యాసిడ్ తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతి చెందినట్లు గురువారం కుటుంబ సభ్యులు తెలిపారు.