ఒంగోలులో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు అనగా మే 27, 28 న జరిగే మహానాడు కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరడం జరిగింది. పార్టీ పటిష్ఠ పెంచేందుకు యువకులు ముందుకు రావాలని సూచించడం జరిగింది.