రాజ్యసభ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన బీదా మస్తాన్ రావు శుక్రవారం ఉదయం నెల్లూరు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లాకు సంబంధించి పలు అంశాలను వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం సీనియర్ నేత దేవరాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.