తెలుగుదేశం పార్టీ మహా పండగ మహానాడుకి టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ స్వాగతం పలికారు. టిడిపి నలభై వసంతాలు, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు యుగపురుషుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలూ అన్ని మహానాడు వేదికపైనే అని ఆయన తెలియజేసారు. నేను తెలుగువాడిని, తెలుగుదేశం వాడిని, మహానాడులో పాల్గొనడం మనకి దక్కిన అదృష్టం . తరలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా.. ఇదే నా ఆహ్వానం అని దేశంలోని అన్ని ప్రాంతాలనుండి టీడీపీ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో తెదేపాధినేత చంద్రబాబు నాయకులకి, కార్యకర్తలకి నూతన ఉత్సాహం తీసుకువస్తారని, అలానే రాబోయే ఎన్నికల్లో అనుసరించవలసిన విధివిధానాలపై దిశా నిర్దేశం చేస్తారని సమాచారం.