గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఓబులవారిపల్లె మండలం దొండ్లోపల్లి గ్రామం, హరిజనవాడ, అరుంధతి వాడల నందు సర్పంచ్ మణి ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజల నుండి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు సలహాలు, అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, కన్వీనర్ ముస్టాక్, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుదర్శన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.