కారు, ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలైన ఘటన కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిపై శివాపురం వద్ద చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గుంటూరుకు చెందిన వ్యక్తులు కారులో ప్రకాశంజిల్లా కుంట వద్దకు వెళ్లి తిరిగి గుంటూరు వెళ్తున్నారు. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే చూడటానికి వచ్చి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బొల్లాపల్లి మండలం కనుమలచెరువుకు చెందిన వ్యక్తిని అదుపుతప్పి కారు ఢీకొనింది. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa