ఎఫ్ డీలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అది ఎస్ఎఫ్ బీ బ్యాంకు తన కస్టమర్ల కోసం ఈ వడ్డీ రేట్లు పెంచింది. కస్టమర్లను ఆకట్టుకొనేలా ఈ ఎఫ్ డీలను తీసుకొచ్చింది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్ బీ) తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్ డీ) వడ్డీ రేట్లు పెరిగాయి. రూ. 2 కోట్లకు లోపు ఎఫ్‌డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 2022 మే 24 నుంచే వడ్డీ రేట్ల పెంపు అమలులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. పలు రకాల కాల పరిమితుల్లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ రాబడి వస్తుంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెరిగింది. 3.25 శాతం నుంచి 3.5 శాతానికి చేరింది. ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బీ అలాగే 91 రోజుల నుంచి 180 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. ఇప్పుడు ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. గతంలో 3.5 శాతం వడ్డీ వచ్చేది. అంటే వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. 181 రోజుల నుంచి 364 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. గతంలో ఈ ఎఫ్‌డీలపై 5.15 శాతం వడ్డీ వచ్చేది.
12 నెలల నుంచి 18 నెలల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెరిగింది. 6 శాతం నుంచి 6.25 శాతానికి చేరింది. అలాగే బ్యాంక్ 18 నెలల ఒక రోజు నుంచి 36 నెలల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 36 నెలల ఒక రోజు నుంచి 42 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7 శాతానికి చేరింది. గతంలో ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75 శాతం వచ్చేది. ఫిన్‌కేర్ ఎస్‌ఎఫ్‌బీ 42 నెలల ఒక రోజు నుంచి 59 నెలల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ వస్తోంది. 59 నెలల ఒక రోజు నుంచి 66 నెలల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.75 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. 66 నెలల 1 రోజు నుంచి 84 నెలల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 6 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్స్ 0.5 శాతం అదనపు వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు.