'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' స్కీమ్ ను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు స్కాలర్ షిప్స్, పీఎం కేర్స్ పాస్ బుక్స్, ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా కార్డును అందిస్తారు. అర్హులైన పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.